మేడిపల్లి: తొంబర్రావుపేటలో ఆసియా ఖండలోనే రెండవ పాలరాతి శివుడి విగ్రహాం, నిజరూపంలో దర్శనమిస్తున్న శివయ్య
ప్రతి ప్రాంతంలో శివాలయాల్లో శివుడు లింగాకారంలో దర్శనమిస్తే, ఇక్కడ మాత్రం పాలరాతి శివుని విగ్రహంలొ దర్శనమిస్తాడు. ఆసియా ఖండంలోని అత్యంత పొడువాటి రెండవ పాలరాతి శివయ్య పేరు పొందింది మేడిపల్లి మండలంలోని తొంబర్రావుపేటలోని శివాలయం, ఇక్కడి ఆలయంలో శివుడు పాలరాతి విగ్రహంలో దర్శనం ఇస్తాడు దీంతో నిత్యం ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు, కోరిన వారికి కొంగుబంగారంగా ఈ ఆలయం పేరుంది, దీంతో ఈ ఆలయానికి వివిధ రాష్ట్రాల నుండి కూడా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు.గ్రామానికి చెందిన అడ్లగంట్ల గౌరవ్వ-బుచ్చమ్మ దంపతులు శివుడి విగ్రహాం ప్రతిష్టించారు.