ఒంగోలు అర్బన్: వందేళ్లు చరిత్ర కలిగిన చర్చిలో ప్రార్థన విషయంలో ఇరు వర్గాల ఘర్షణ పోలీసుల మోహరింపు
Ongole Urban, Prakasam | Apr 26, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలులోని బాప్టిస్ట్ చర్చి లో ప్రార్థనలు చేసే విషయంలో కమిటీ సభ్యుల మధ్య మరోసారి వివాదం చెలరేగింది. పాస్టర్ అగస్టీన్ పుల్ పీట్ ఎక్కి ప్రార్థనలు చేసేందుకు వీలులేదని పాస్టర్ కెనడీ వర్గం అడ్డుకుంది. దీంతో అగస్టీన్, కెనడీ వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చర్చిలో ఘర్షణలు జరగకుండా పాస్టర్ అగస్తీన్ ని పోలీసులు బయట అడ్డుకున్నారు. దీంతో వర్గం అగస్టీన్ వర్గం చర్చి ఎదుట ఆందోళనకు దిగింది. ఒంగోలులోని బాప్టిస్ట్ చర్చి కి వందేళ్లకు పైబడి చరిత్ర ఉంది. అయితే చర్చిలో ప్రార్థనలు చేసే విషయంలో కమిటీ సభ్యుల మధ్య వివాదం గత కొంతకాలంగా సాగుతోంది.