పలమనేరు: నూతన మున్సిపల్ కాంప్లెక్స్ మందుబాబులకు అడ్డాగా మారింది, వర్షానికి కారుతోందని ఆరోపణలు చేసిన దుకాణదారులు
పలమనేరు: నూతన మున్సిపల్ కాంప్లెక్స్ దుకాణదారులు మీడియా తెలిపిన సమాచారం మేరకు. మూడేళ్ల క్రితం వైఎస్ఆర్ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ను అట్టహాసంగా ప్రారంభించారు అప్పటి నాయకులు. చిన్న వర్షానికే రూములు మొత్తం కారుతున్నాయి, అంతేకాకుండా మున్సిపల్ కాంప్లెక్స్ చుట్టూ స్ట్రీట్ వెండర్స్ షాపులు ఏర్పాటు చేసుకొని ఉన్నారు దాని వలన మావ్యాపారాలు దెబ్బతింటున్నాయి. వెనుక పక్క ఓపెన్ ప్లేస్ ఉండటం వలన మందుబాబులు పగలు రాత్రి తేడా లేకుండా మద్యం సేవిస్తూ ప్రశ్నిస్తే షాపుల వారి పైన తిరగబడుతున్నారు. లక్షల రూపాయల అడ్వాన్సులు ఇచ్చి వేలాది రూపాయల బాడుగుల కడుతున్న మాకు సమస్యలే దర్శనమిస్తున్నాయన్నారు.