డోన్: ప్రజల సమస్యపై తక్షణమే స్పందించిన డోన్ మున్సిపల్ కమిషనర్
Dhone, Nandyal | Apr 10, 2026 నంద్యాల జిల్లా డోన్లో పాత బస్టాండ్ పరిసరాల్లో మురికి కాలువ చెత్తతో నిండిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. కాలువలో పేరుకుపోయిన చెత్త కారణంగా మురికి నీరు రోడ్డుపైకి పొంగిపొర్లుతూ రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. శుక్రవారం మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ స్పందించి పారిశుధ్య పనులు చేపట్టారు. పట్టణంలో ఎక్కడైనా ఇలాంటి సమస్యలు ఉంటే మున్సిపాలిటీ అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు