వేసవి తాపానికి ఎండిపోతున్న నల్లమల అడవి ప్రాంతం.కనుమరుగైన పచ్చదనం
వేసవిలో ఎండలు ముదరడంతో ప్రతీ చెట్టు ఎండిపోయింది. ఆత్మకూరు ,శ్రీశైలం, దోర్నాల, వెలుగోడు నంద్యాల - గిద్దలూరు జాతీయ రహదారి నల్లమల్ల అడవి ప్రాంతంలోని చెట్లకు చిగురు లేకపోవడంతో పక్షులతో పాటు, చిన్న చిన్న జంతువులు ఆహారానికి ఇబ్బందులు పడుతున్నాయి. నెల రోజుల క్రితం పచ్చదనంతో దట్టంగా అలుముకున్న అడవి నేడు బోసిపోయి కనిపిస్తోంది. అడవి ప్రాంతాల్లోని వన్యప్రాణులకు అధికారులు నీటి వసతి కల్పించాలని ప్రయాణికులు, ప్రజలు కోరుతున్నారు. అట్లాగే వరుణదేవుడు కరుణించి ఒక వర్షం కురిపిస్తే, తిరిగి నల్లమల అడవి ప్రాంతం పచ్చదనం సంతరించుకునే అవకాశం ఉంది.