జహీరాబాద్: ఎల్గోయి గ్రామంలో విషాదం, బిడ్డ మరణాన్ని తట్టుకోలేక తల్లి ఆత్మహత్య
బిడ్డ మరణం తట్టుకోలేక తల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జరా సంఘం మండలంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బోయిని వెంకట్, లావణ్యలకు కూతురు పుట్టి అనారోగ్యానికి గురై శనివారం ఉదయం ఆసుపత్రిలో మరణించింది. గ్రామంలో పాప అంత్యక్రియలు నిర్వహించిన అనంతరం సాయంత్రం వేళ మనస్థాపానికి గురైన తల్లి లావణ్య ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటన స్థలానికి చేరుకున్న జరా సంగం పోలీసులు మృతదేహాన్ని జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.