బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ తెలంగాణ భజరంగ్ సేన ఆధ్వర్యంలో కాచిగూడ చౌరస్తాలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. సేన అధ్యక్షుడు లక్ష్మణ్ రావు నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో నిరసనకారులు దౌర్జన్యాలను ఖండిస్తూ నినాదాలు చేశారు. బంగ్లాదేశ్ జెండాను దగ్ధం చేశారు. హిందూ హక్కుల పరిరక్షణకు గళమెత్తాలని, కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.