తనుబొద్ది వారి పాలెం,పోలూరు గ్రామలలో ప్రభుత్వ భవనాలను ప్రారంభించిన వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ యడం బాలాజీ
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటేనే పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సుఖసంతోషాలు ఉంటాయని పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జ్ యడం బాలాజీ అన్నారు. బుధవారం యద్దనపూడి మండలం తనుబొద్ధి వారి పాలెం గ్రామంలో దాదాపు కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన సచివాలయం, వైయస్సార్ హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలను యడం బాలాజీ ప్రారంభించారు.