ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బహిరంగంగా మద్యం తాగుతున్న ప్రాంతాలను గుర్తించి శుభ్రం చేసిన పోలీసులు
Ongole Urban, Prakasam | Jun 17, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బహిరంగంగా మద్యం తాగుతున్న ప్రాంతాలను బుధవారం పోలీసులు గుర్తించి పోలీసులు శుభ్రం చేశారు. బహిరంగంగా మద్యం తాగడం చట్టరీత్యా నేరమని ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో నిరంతరం బహిరంగంగా మద్యం తాగుతున్న ప్రాంతాలపై నిగా ఉంచడం జరుగుతుందని పోలీసులు తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పోలీసు అధికారులు ప్రాంతాలను పరిశుభ్రం చేసి ఇకమీదట ఈ ప్రాంతాలపై నిగా ఉంచుతామన్నారు.