సంతనూతలపాడు: చీమకుర్తి 3వ వార్డు నందు పర్యటించిన ఎమ్మెల్యే బి.ఎన్. విజయ్ కుమార్
చీమకుర్తి పట్టణం 3వ వార్డ్ నందు యడ్లపల్లి రాంబ్రహ్మం యూనిట్ పరిధిలో గిన్నెలస్వామి బజారు, తోపు బజారు లో సూపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా సంతనూతలపాడు ఎమ్మెల్యే బి.ఎన్. విజయ్ కుమార్ గురువారం సాయంత్రం పర్యటించారు. ఇంటి ఇంటికి తెలుగుదేశం కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ పధకాల కర పత్రాలను ప్రజలకు అందిస్తూ వారి సమస్యల గురించి అడిగితెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ సెక్రటరీ ఆడక స్వాములు, AMC చైర్మన్ మన్నం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.