అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం కోనంపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో 1,50,000/- వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన దాతలను గురువారం సన్మానించారు. పాఠశాల ఆవరణంలో రేకుల షెడ్డు నిర్మించిన దాతలు A. G.ప్రమీలమ్మ, గూడూరు నరసింహులు వారి కుమారులు పూర్వ విద్యార్థులు హరిక్రిష్ణ, శరత్ లను పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ నాయక్ అధ్యక్షతన, ఎంపీపీ పెద్దన్న ముఖ్య అతిథులుగా పాల్గొని ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యతో దుశ్యాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించడం జరిగింది.