ఒంగోలు అర్బన్: రాడిసన్ హోటల్ నిర్మాణానికి న్యూఢిల్లీలో పూర్తయిన అవగాహన ఒప్పందం. త్వరలో హోటల్ నిర్మాణం పలువురికి ఉపాధి
Ongole Urban, Prakasam | Jun 11, 2026
ప్రకాశం జిల్లా చదలవాడలోని సాయి విష్ణు చతుర్వాటిక వెంచర్ ఆవరణలో రవిప్రియ గ్రూప్ మరియు రాడిసన్ హోటల్ నిర్మించు టకు గాను గురువారం న్యూ ఢిల్లీలోని రాడిసన్ ప్రధాన కార్యాలయంలో అవగాహనా ఒప్పందం జరిగినది.ఈ కార్యక్రమంలో రవి ప్రియా గ్రూప్ సంస్థల అధినేత కంది రవిశంకర్ మరియు రాడిసన్ హోటల్స్ ఎండీ. సీపీఓ సౌత్ ఆసియ నిఖిల్ శర్మ మరియు వైస్ ప్రెసిడెంట్ సౌత్ ఆసియా దేవాశిష్ శ్రీవాత్సవ సమక్షంలో జరిగినది.ఈ సందర్బంగా స్థానిక యువతకు ఉపాధి మరియు జిల్లా అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న కంది రవిశంకర్ కీ పలువురు అభినందనలు తెలియజేశారు ..