ఆళ్లగడ్డ: అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకున్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఆదివారం దర్శించుకున్నారు, మటన్ సీఈవో పార్థసారథి, ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు, ఎంపీ బాలశౌరి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఆయనకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు, ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ జనసేన ఇన్చార్జి మైలేరి మల్లయ్య, జనసేన నాయకులు ఇరిగేల రాంపుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు