ఆళ్లగడ్డ: బనగానపల్లెలో సీఎం చంద్రబాబు నాయుడు మర్యాదపూర్వకంగా కలిసిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
నంద్యాల జిల్లా బనగానపల్లెలో మీ భూమి మీ హక్కు కార్యక్రమాలలో పాల్గొనేందుకు వచ్చిన గౌరవ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబును హెలి ప్యాడ్ వద్ద గురువారం ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మర్యాదపూర్వకంగా కలిశారు, ఆళ్లగడ్డ నియోజకవర్గం అభివృద్ధి భూ సమస్యల పరిష్కారం ప్రభుత్వ సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సీఎంతో ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ చర్చించారు, నియోజకవర్గానికి ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరిన్ని అభివృద్ధి పనులకు సహకారం అందించాలని సీఎంను కోరారు