అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
అదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని సానికులు కనుగొన్నారు. స్థానిక దుర్గ నగర్ కాలనీలోని వాగు వద్ద శుక్రవారం 30 నుండి 35 ఏళ్ల వయస్సు గల ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని కనుగొనట్లు మావల ఎస్ఐ తెలిపారు. మృతుడు ఎల్లో కలర్ టి షర్ట్, గోధుమ కలర్ ప్యాంట్ ధరించి ఉన్నారన్నారు. మృతదేహాన్ని రిమ్స్ కు తరలించమని తెలిపారు. ఎవరైనా మృతదేహాన్ని గుర్తిస్తే పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలన్నారు.