అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెద్ద ముస్టురు గ్రామంలో కౌలు రైతు నారాయణస్వామి (40) రైతు ఇంట్లోనే ఉరి వేసుకుని బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంధువులు, కుటుంబ సభ్యులు పోలీసులకు పిర్యాదు చేసారు. వ్యవసాయంలో వరస నష్టాలు రావడంతో రూ.10 లక్షలకు పైగా అప్పులు కావడంతో ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్న కుటుంబ సభ్యులు, బంధువులు పేర్కొన్నారు.