బనగానపల్లె: మంత్రి నారా లోకేష్ ను అభినందించిన నంద్యాల జిల్లా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన విద్యాశాఖ మంత్రి లోకేశ్ను రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కలిసి అభినందించారు. శుక్రవారం ఉండవల్లిలోని లోకేశ్ క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ భవిష్యత్తు నాయకుడు లోకేశ్ అని మంత్రి బీసీ పేర్కొన్నారు.