అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని బళ్లారి బైపాస్ రోడ్డులో వృద్ధుడు అనుమానాస్పద మృతి
Anantapur Urban, Anantapur | Apr 16, 2026
అనంతపురం నగరంలోని బళ్లారి బైపాస్ రోడ్డులో ఉన్న ఎంజి పెట్రోల్ పంప్ ఎదుట ఉన్న వీధిలో నివాసం ఉంటున్న కృష్ణారెడ్డి అనే వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతను గత కొన్ని సంవత్సరాల నుంచి స్థానిక ఇంటిలో నివాసం ఉంటున్నాడు. ఒక్కసారిగా కిందపడి తీవ్రమైన గాయాలు అవ్వడంతో మృతి చెందినట్లుగా అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. నాలుగవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.