ఎల్కతుర్తి: ఎలుకతుర్తి మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు
రైతులకు సరిపడా యూరియాను పంపిణీ హనుమకొండ జిల్లా ఎలుకతుర్తి మండల కేంద్రం లోని జాతీయ రహదారి పై రైతులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో కరీంనగర్ నుండి వరంగల్ మార్గం లో వాహనాలు భారీగా నిలిచిపోయాయి.ప్రభుత్వం వెంటనే రైతులకు యూరియా ఇవ్వాలి అంటూ నినాదాలు చేశారు. సుమారు గంట పైగా రాస్తారోకో కొనసాగింది. విషయం తెలుసుకున్న పోలీసులు రాస్తారోకో వద్దకు వచ్చి రైతులకు నచ్చచెప్పి రాస్తారోకోను విరమింప చేశారు.