పిజిఆర్ఎస్ లో వచ్చే అర్జీలను నాణ్యతగా పరిష్కారం చేయాలి:డిఆర్ఓ మధుసూదన్ రావు
పి జి ఆర్ ఎస్ లో వచ్చే అర్జీలకు నాణ్యతతో పరిష్కారం చూపాలని డిఆర్ఓ మధుసూదన్ రావు అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మధుసూదన్ రావు మాట్లాడుతూ...ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి స్వీకరించిన విజ్ఞప్తులను నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో నిశితంగా అర్జీలను పరిశీలించి నిర్దిష్ట కాలపరిమితిలోగా ప్రజా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.