కనిగిరి పట్టణంలోని ఎన్జీవో భవనంలో కనిగిరి ప్రాంత పెయింటర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రధమ మహాసభ ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు సయ్యద్ యాసిన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెయింటర్స్ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అర్హులైన పెయింటర్స్ కు ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, పెన్షన్లను, భూమిలేని వారికి భూములను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయాలన్నారు. ఈ సందర్భంగా కనిగిరి ప్రింటర్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షునిగా నాగూర్ తోపాటు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.