అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ లో కిడ్నీ వ్యాధుల ప్రత్యేక వైద్య శిబిరాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ
అనకాపల్లి మండలంలో పలు గ్రామాల్లో కిడ్నీ వ్యాధి బారిన పడ్డవారికి పూర్తిగా వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు, అనకాపల్లి మండలంలో కిడ్నీ వ్యాధుల బారిన పడిన 45 మందికి అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ లో మంగళవారం ఏర్పాటు చేసిన కిడ్నీ వ్యాధుల ప్రత్యేక వైద్య శిబిరంలో పరీక్షలు నిర్వహించారు, వైద్య పరీక్షలను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ దగ్గరుండి పర్యవేక్షించారు.