నంద్యాల అర్బన్: బొల్లవరంలో పీర్ల స్వాముల ఊరేగింపులో అదరగొట్టిన కళాకారుల నృత్యాలు
Nandyal Urban, Nandyal | Jun 26, 2026
నంద్యాల జిల్లామహానంది మండలం బొల్లవరం గ్రామంలో శుక్రవారం మొహర్రం వేడుకలు వైభవంగా జరిగాయి. పీర్ల స్వాముల ఊరేగింపు సందర్భంగా గ్రామస్థులు వేసిన రకరకాల వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.డప్పు వాయిద్యాల మోతల మధ్య కళాకారులు ప్రదర్శించిన సాంప్రదాయ నృత్యాలు అందరినీ కట్టిపడేశాయి. ఉదయం నుంచే గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా, ప్రతిభ చాటిన కళాకారులను గ్రామస్థులు ఘనంగా అభినందించారు.