ఒంగోలు అర్బన్: ప్రకాశం జిల్లా జనసేన నాయకుల దరఖాస్తుల కార్యక్రమం నేటితో ముగిసిందని పరిశీలకులు రోశయ్య వెల్లడి
Ongole Urban, Prakasam | Jul 5, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆదివారం జనసేన నాయకుల సేకరణ దరఖాస్తుల కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ప్రకాశం జిల్లా పరిశీలకులు కిలారి రోశయ్య హాజరయ్యారు. వారం రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 1500 మందికిపైగా ప్రకాశం జిల్లా నుంచి జనసేన నాయకులు దరఖాస్తులు చేసుకున్నట్లు రోశయ్య తెలిపారు. అర్హులైన వారిని పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లాలో వారి వారి నియోజకవర్గాలలో నియమిస్తారని తెలిపారు.