నంద్యాల జిల్లాలో మెడికల్ షాపులు బంద్
Nandyal Urban, Nandyal | May 20, 2026
నంద్యాల జిల్లాలో మెడికల్ షాపుల యజమానులు చేస్తున్న సమ్మెలో భాగంగా బుధవారం అన్ని మెడికల్ షాపులను మూసేశారు. జిల్లా మెడికల్ అసోసియేషన్ నాయకులు తహశీల్దార్ కార్యాలయానికి చేరుకొని సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందించారు. ఆన్లైన్ వ్యవస్థ ద్వారా మెడికల్ షాపుల మనుగడ కష్టంగా ఉందన్నారు. ప్రభుత్వం నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేశారు.