ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ తాసిల్దార్ కార్యాలయంలో పి జి ఆర్ ఎస్ లో రైతుల నుంచి అర్జీలను స్వీకరించిన తాసిల్దార్ జ్యోతి రత్నకుమారి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ లోని తాసిల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS కార్యక్రమంలో తాసిల్దార్ జ్యోతి రత్నకుమారి పాల్గొన్నారు, 8 మంది రైతులు ఆన్లైన్ భూ సమస్యలపై తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు, అనంతరం తాసిల్దార్ జ్యోతి రత్నకుమారి నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని డిఆర్ఓ రాము నాయక్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కూడా రెవెన్యూ ఇతర శాఖ అధికారులతో కలిసి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ మండలంలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు