వీర్ బాల్ దివస్ సందర్భంగా సికింద్రాబాద్ గురుద్వారాలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సాహిబ్జాదా బాబా జోరావర్ సింగ్ జీ, సాహిబ్జాదా బాబా ఫతేహ్ సింగ్ జీ త్యాగాలను స్మరించుకుని ఘన నివాళులు అర్పించారు. వారి ధైర్యం, బలిదానం దేశానికి శాశ్వత ప్రేరణగా నిలుస్తాయన్నారు.