డోన్: డోను- గుత్తి ప్రధాన రహదారిపై ప్రమాదకరంగా చెట్లు
Dhone, Nandyal | May 12, 2026 నంద్యాల జిల్లా డోన్ నుంచి గుత్తి వెళ్లే ప్రధాన రహదారిపై ప్రమాదకరంగా పెరిగిన రోడ్డు మధ్యలో చెట్లు ద్విచక్ర వాహనదారులకు ముప్పుగా మారాయి. యూటర్న్ ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు అడ్డుగా ఉండటంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని మంగళవారం స్థానికులు తెలిపారు. రాత్రివేళల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందని వాపోయారు. చెట్ల కొమ్మలను తొలగించి భద్రతా చర్యలు చేపట్టాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.