బనగానపల్లె: అంబేద్కర్ ఆశయ సాధన మా లక్ష్యం :బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
అంబేడ్కర్ చూపిన మార్గంలోనే సమానత్వ సమాజ నిర్మాణం సాధ్యమని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. జయంతిని పురస్కరించుకొని బనగానపల్లెలోని అవుకుమెట్ట వద్దనున్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఆయన మాట్లాడుతూ విద్య, సమానత్వం, న్యాయం అందించడమే అంబేడ్కర్ ఆశయాలని, వాటిని కొనసాగించడం మనబాధ్యతని పేర్కొన్నారు.