రామాపురం మండల తాసిల్దార్ కార్యాలయాన్ని జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా సంయుక్త కలెక్టర్ తాసిల్దార్ కార్యాలయ సిబ్బందితో పి జి ఆర్ ఎస్ రి సర్వే తదితర అంశాలపై సమీక్షించి కార్యాలయం సిబ్బందికి తగు సూచనలు చేశారు. అనంతరం రాయచోటి డివిజన్లోని 08 మండలాలకు సంబంధించిన 41 వెబ్ ల్యాండ్ మార్పుల దస్త్రాలపై చర్యలు తీసుకునేందుకు స్వయంగా క్షేత్ర క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత మండల తాసిల్దారులతో చర్చించి సదరు దస్త్రాలపై చర్యలు తీసుకున్నారు.