కర్నూలు: తలసేమియా వ్యాధిగ్రస్తుల ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి : డాక్టర్ పీ. శ్రీహరి
తలసేమియా వ్యాధిగ్రస్తుల ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని డాక్టర్ పీ. శ్రీహరి తెలిపారు. బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మరియు స్వస్తి నారి సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఉచిత రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. యువత రక్తదాతలగా మారి ప్రాణదాతలుగా నిలవాలని తెలిపారు. రక్తం దొరక్క స్త్రీలు రహదారి ప్రమాదాలతో పాటు ఆపరేషన్లు తలసేమియా అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి తోడుగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు.వంద మందితో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.