నంద్యాల అర్బన్: తిమ్మాపురం పిఎస్సి వైద్యుల సస్పెన్షన్ పై వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చిన డి ఎం హెచ్ ఓ డాక్టర్ వెంకటరమణ
Nandyal Urban, Nandyal | Apr 30, 2026
నంద్యాల జిల్లా మహానంది మండలం తిమ్మాపురం పిహెచ్సిలో పనిచేస్తున్న ఇద్దరి వైద్యులను ఇటీవల జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో సమయపాలన పాటించని ఆ ఇద్దరు వైద్యులను జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సస్పెండ్ చేశారు అయితే ఈ విషయంపై వస్తున్న ఆరోపణలపై ఆయన మీడియాకు వివరణ ఇచ్చారు