కరీంనగర్: మహాశక్తి ఆలయంలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న బండి సంజయ్
మహాశక్తి ఆలయ ప్రాంగణంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని బతుకమ్మలను పేర్చి వేడుకలను జరుపుకున్నారు.