ఒంగోలులో వైసీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం, వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ విడుదల
Ongole Urban, Prakasam | Jun 2, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు వైసిపి కార్యాలయంలో మంగళవారం వైసిపి జిల్లా అధ్యక్షుడు దశ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వీడియో సమావేశం నిర్వహించారు. జూన్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించే చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాన్ని ఉద్దేశించి వాల్పోస్టర్ని విడుదల చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను చంద్రబాబు మోసం చేశారని బూచేపల్లి మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు. మాజీ సీఎం జగనన్న ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని కార్యకర్తలు నాయకులు నిర్వహించాలని సూచించారు.