డోన్: బేతంచర్ల మండలంలో పెట్రోల్ కొరత
Dhone, Nandyal | Apr 22, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలో మూడు రోజులుగా పెట్రోల్ సరఫరా లేకపోవడంతో ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని తొమ్మిది బంకులకు సక్రమంగా నిల్వలు రాకపోవడంతో యాజమాన్యాలు నో స్టాక్ బోర్డులు పెడుతున్నాయి. బుధవారం పట్టణంలోని ఆరు బంకుల్లో కేవలం ఒక్క చోట మాత్రమే పెట్రోల్ అందుబాటులో ఉండటంతో వాహనదారులు భారీగా క్యూ కట్టారు. 103 చదవని వార్తలు