కామారెడ్డి: తెలంగాణ విమోచన దినోత్సవం కరపత్రం విడుదల : బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు
కామారెడ్డి : తెలంగాణ విమోచన దినోత్సవం పై బీజేపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో నిర్వహించడం జరిగింది. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు తెలంగాణ విమోచన దినోత్సవం కరపత్రం విడుదల చేశారు. ఆయన మారట్లాడుతూ.. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాలు జరపాలని 1998లో మొదలుపెట్టిన బిజెపి పోరాటం మధ్యలో కరోనా కారణంగా రెండేళ్లు మినహాయిస్తే 25 ఏళ్లుగా కొనసాగుతోందనీ, ఈసారి బిజెపి విమోచన ఉద్యమ రజతోత్సవాలను జరుపుకుంటున్నామని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగి సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాలను జరపాలన్నారు.