కలెక్టరేట్‌లో బడ్జెట్ 2026-27 అవుట్‌రీచ్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పయ్యావుల కేశవ్
Anantapur Urban, Anantapur | Apr 3, 2026
బడ్జెట్‌లో కేటాయించే ప్రతి రూపాయిని ఎక్కడ, ఎలా ఖర్చు చేయాలనే దానిపై స్పష్టమైన ప్రణాళిక ఉండాలని, ఆయా శాఖలకు సంబంధించిన బడ్జెట్ ను వివరణాత్మకంగా రూపొందించాలని రాష్ట్ర మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ ఆదేశించారు.అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో "బడ్జెట్ 2026-27 అవుట్‌రీచ్ కార్యక్రమం" నిర్వహించగా, కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్, ప్రభుత్వ విప్ మరియు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.