చంద్రబాబు పాలనలో రాయలసీమ అభివృద్ధి నిలిచిపోయింది:వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి
రాయలసీమ అభివృద్ధి, ప్రజా సంక్షేమ అంశాలపై వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.వైఎస్ఆర్సిపి ప్రజా ఉద్యమ ర్యాలీకి పోలీసులు విధించిన ఆంక్షలను మించి విద్యార్థులు, యువకులు స్వచ్ఛందంగా పాల్గొనడం ప్రజల మద్దతుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కళాశాలలు కొనసాగితేనే పేద విద్యార్థులకు వైద్య విద్య మరింత చేరువ అవుతుందని తెలిపారు.