డోన్: సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేశారు: డోన్ వైసీపీ నేతలు
Dhone, Nandyal | Jun 9, 2026 సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేశారని ఎంపీపీలు రాజశేఖర్ రెడ్డి, నాగభూషణం రెడ్డి విమర్శించారు. మంగళవారం డోన్ పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన "వెన్నుపోటుకు రెండేళ్లు" కార్యక్రమంలో భాగంగా వారు నల్ల బెలూన్లను గాల్లోకి వదిలి నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సూపర్ సిక్స్ హామీలను తక్షణమే అమలు చేసి ప్రజలను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.