ఒంగోలు అర్బన్: గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంపుకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది:రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి
Ongole Urban, Prakasam | May 30, 2026
గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంపుకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ నిధుల ద్వారా అందించిన స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర రిక్షాలు, చెత్త సేకరణ డబ్బాలు కొండపి గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి డా.స్వామి మాట్లాడుతూ.. గ్రామాల్లో నూరు శాతం చెత్త సేకరణ జరగాలన్నారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. పరిసరాల పరిశుభ్రత సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు