ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణములోని వైపిపీఎం క్రీడామైదానంలో ముగిసిన ఫుట్బాల్ లీగ్ మ్యాచ్ లు
ఆళ్లగడ్డ పట్టణంలోని వైపిపిఎం క్రీడా మైదానంలో జరుగుతున్న ఫుట్ బాల్ లీగ్ మ్యాచ్ లు నేటితో ముగిశాయి, ఈ ముగింపు వేడుకల్లో ఏపీ ఫుట్ బాల్ అసోసియేషన్ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్ఆర్ అకాడమీ ఆధ్వర్యంలో ఇలాంటి ఫుట్బాల్ లీగ్ పోటీలు నిర్వహించడం ఎంతో అభినందనీయం అన్నారు, అనంతరం పోటీల్లో ప్రతిభ విజేతలకు క్రీడాకారులకు ఆయన చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు