ఉరవకొండ: బిందు సేద్య పొలాలను పరిశీలించి డ్రిప్ ఇరిగేషన్ పై రైతులకు అవగాహన కల్పించిన మైక్రో ఇరిగేషన్ PD రఘునాథరెడ్డి
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని జీడిపల్లి రామసాగరం కోనంపల్లి దుద్దేకుంట గ్రామాలలో శుక్రవారం ఉదయం నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఆయా గ్రామాల్లో బిందు సేద్య పొలాలను పరిశీలించిన మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు డైరెక్టర్ రఘునాథరెడ్డి స్థానిక అధికారులు డ్రిప్ కంపెనీ ప్రతినిధులతో కలిసి డ్రిప్ పరికరాల వినియోగంపై అవగాహన కల్పించారు. 2024-25 సంవత్సరంలో అందించిన పరికరాలను ర్యాండం గా పరిశీలించి పర్టిగేషన్ పైన, 90 శాతం రాయితీపైన, రైతులకు బెళుగుప్ప ఎంఐఓ మల్లేష్ తో కలిసి అవగాహన కల్పించారు.