ఖైరతాబాద్: నగరంలో హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో సైబర్ నేరాల పై పై అవగాహన కార్యక్రమం
హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఫోన్ కాల్స్, సోషల్ మీడియా, ఆన్లైన్ ఇంటరాక్షన్ ద్వారా నేరాలు పెరుగుతున్నాయని, పాత నేరస్థుల మాదిరిగానే కొత్త నేరగాళ్లు ప్రజల డేటాను సేకరించి వారిని లక్ష్యంగా ఎంచుకుంటున్నారని తెలిపారు. ఇది సాధారణ సమస్య కాదని ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని హెచ్చారించారు.