బనగానపల్లె: సంజాములలో సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను పరిశీలించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
సంజామలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన డ్వాక్రా, పొదుపు సంఘాల మహిళల స్టాళ్లను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. మహిళల ఆర్థిక పురోగతి, బ్యాంకు రుణాల వినియోగంపై ఆరా తీశారు. మహిళలు స్వయం ఉపాధితో పాటు ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని సూచించారు. అనంతరం సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించి, ఆర్గానిక్ వ్యవసాయ దిగుబడులు పెంచాలని మంత్రి సూచించారు.