చిన్మయి నగర్ జెఎన్టియు విశ్వవిద్యాలయంలో ఐఐసీ స్టాటప్ ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్న ఉపకులపతి సుదర్శన్ రావు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని చిన్మయి నగర్ ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు సమయంలో ఐఐసీ స్టేట్ ఆఫ్ చాలెంజింగ్ కార్యక్రమంలో ఉపకులపతి హెచ్ సుదర్శన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపొక్కులపతి సుదర్శన్ రావు మాట్లాడుతూ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో ఏర్పాటు చేసి ఒక ప్రతిష్టాత్మక సంస్థని ఇది స్టాటప్ కంపెనీలకు ఐటి మరియు ఉత్పత్తి రంగంలో వారికి మద్దతు ఇవ్వడం ద్వారా ఆవిష్కరణలకు ఊతమిస్తుందని, ఈ అవకాశాన్ని విద్యార్థినిలు సభ్యులు చేసుకొనికొత్త ఇండస్ట్రియల్ ఆవిష్కరణలు చేయాలని ఉపకులపతి సుదర్శన్ రావు పిలుపునిచ్చారు.