మంచాల మండల పరిధిలోని ఆరుట్ల బుగ్గ తండా సమీపంలో ఉన్నటు వంటి దక్షిణ కాశీగా పిలవబడే బుగ్గరామలింగేశ్వర స్వామి జాతర బుధవారం భక్తులతో సందడిగా నెలకొంది. జాతరకు స్థానిక ప్రజలే కాక హైదరాబాద్, నల్లగొండ, జిల్లాల ప్రజలు వేలాదిగా బుగ్గ జాతరకు తరలివస్తున్నారు. రేపు చివరి రోజు కావడంతో ఈరోజు వేలమంది భక్తులు దర్శించుకున్నారు. ఆలయ మొత్తం భక్తులతో కిటకిటలాడుతుంది.