మిర్యాలగూడ: నిరాధారణ ఆరోపణలు జానారెడ్డి కుటుంబం, స్థానిక ఎమ్మెల్యే బిఎల్ఆర్ పైన చేస్తే ఊరుకోబోము: కాంగ్రెస్ నాయకులు
నిన్న మిర్యాలగూడ బిజెపి కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదివారం సాయంత్రం మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్ భవన్ లో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బిజెపి జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి అవగాహన రాయిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. మాజీ మంత్రి జానారెడ్డి కుటుంబం, స్థానిక ఎమ్మెల్యే బిఎల్ఆర్ పైన నిరాదరణ ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు.