షాద్నగర్ పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో గురువారం ఉద్రిక్తత నెలకొంది. విద్యుత్ స్తంభాలకు కట్టిన ఫ్లెక్సీ బ్యానర్లకు అకస్మాత్తుగా మంటలు చెలరేగి పెద్ద ఎత్తున వ్యాపించాయి. చౌరస్తాలో బీఎస్పీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించిన సందర్భంగా టపాకాయలు కాల్చగా, వాటి నుంచి వచ్చిన నిప్పురవ్వలు ఫ్లెక్సీలకు అంటుకోవడంతో అగ్నిప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.