ఒంగోలు అర్బన్: ఒంగోలు పట్టణంలోని బాలాజీ నగర్, బత్తుల వారి కుంటలో కార్డెన్ సర్చ్ నిర్వహించిన పోలీసులు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం
Ongole Urban, Prakasam | Jun 7, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు టూ టౌన్ పరిధిలోని బాలాజీనగర్, బత్తులవారికుంటలో ఆదివారం డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. 40 మంది పోలీస్ సిబ్బంది క్షుణ్ణంగా ప్రతి ఇంటినీ తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో గంజాయి ఇతర మాదకద్రవ్యాల నిల్వ విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పాత ముద్దాయిల నివాసాలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ధ్రువీకరణ పత్రాలు లేని రెండు బైకులను స్టేషను తరలించారు.