నంద్యాల అర్బన్: జగన్ పాలనలోనే దళితులపై దాడులు : నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్
Nandyal Urban, Nandyal | May 19, 2026
వైసీపీ హయాంలో దళితులపై 56,981 దాడులు జరిగాయని టీడీపీ నేత ఎన్ఎండీ ఫిరోజ్ ఆరోపించారు. నంద్యాల టీడీపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రమణ్యం, ఎంపీడీవో జవహర్ బాబు ఘటనలే ఇందుకు ఉదాహరణలన్నారు. జగన్ కేవలం ఎన్నికల కోసమే దళితులను వాడుకుని, తర్వాత నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. సబ్లాన్ నిధులను దారి దారి మళ్ళించారని తెలిపారు